రాణా, ఇలియానా కాంబినేషన్ లో రూపొందిన నేనూ..నా రాక్షసి చిత్రం ఈ రోజు (శుక్రవారం) విడుదల అవుతోంది. ఈ చిత్రంలో ఫెరఫెక్ట్ ప్లానింగ్ తో మర్డర్స్ చేసే ప్రొఫెషనల్ కిల్లర్ అభిమన్యు (రాణా). వృత్తిలో భాగంగా ఎంతట సమస్యను అయినా సాహసింతో ఎదుర్కొంటూంటాడు. ఇక మీనాక్షి (ఇలియానా)అందంతోపాటు తెలివితేటలున్న నేటితరం యువతి. ఓ సమస్యతో తీవ్రమైన మానసిక క్షోభను అనుభవిస్తుంటుంది. ఓ రోజు అనుకోకుండా అభిమన్యుకి మీనాక్షి తారసపడుతుంది. వారిద్దరి కలయిక ఏ పరిస్థితులకు దారి తీసింది. అసలు మీనాక్షి సమస్యేమిటి? వారిద్దరి మధ్య జరిగే మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందనే విషయాల్ని తెరపైనే చూడాలి అంటున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ..ఆత్మహత్యల నేపథ్యంలో అల్లుకొన్న కథ ఇది. అసాధారణంగా ప్రవర్తించే రెండు పాత్రల చుట్టూ నడుస్తుంది. ఆ పాత్రల చిత్రణ అందరికీ నచ్చుతుంది. వెనిస్‌లో చిత్రించిన సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అలీ, ముమైత్‌ఖాన్ కామెడీ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తుంది. నేను బాగా ఇష్టపడి రాసుకొన్న కథ ఇది అంటున్నారు.
సంస్థ: లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్
నటీనటులు: రాణా, ఇలియానా, సుబ్బరాజు, అలీ, అభిమన్యు సింగ్, ముమైత్‌ఖాన్ తదితరులు
సంగీతం: విశ్వ-రెహమాన్
నిర్మాత: నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి)
దర్శకత్వం: పూరి జగన్నాథ్
No comments:
Post a Comment