ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎవరికీ తలవంచడు..ఎవరినీ భరించడు అన్నట్లుగా ఉంటాడన్నది జగమెరిగిన సత్యం. అయితే ఇప్పుడు సీన్ తిరగబడిందంటున్నారు. తాజాగా ఆయన అభిషేక్ బచ్చన్ పై చేసిన ఎస్ ఎమ్మెస్ వివాదం అంతటా సంచలనం అయ్యేలా చేసింది. ఈ నేపధ్యంలో ఇలాంటివి ఇష్టపడిని అమితాబ్ తన కుమారుడుని విమర్శించిన దర్శకుడుతో పనిచేయటం ఎందుకుని తప్పుకునే ఆలోచనలో ఉన్నట్లు ముంబై మీడియానుంచి వార్తలు వినపడుతున్నాయి. అయితే ఈ పరిస్ధితి తన చేయజారిపోతోందని భావించిన వర్మ దాన్ని చక్కదిద్దేందుకు రంగంలో దిగాడని నిన్న రాత్రి చాలా సేపు అమితాబ్ ఆయన చర్చలు జరిపాడని అంటున్నారు.
వర్మ కారు రాత్రి చాలా సేపు అమితాబ్ ఇల్లు జల్సా వద్ద నిలబడి ఉందని చెప్తున్నారు. అయితే అమితాబ్ మాత్రం చాలా కోపంగా ఉన్నాడని, తన కుమారుడు నటన బాగోలని ఎస్సమ్మెస్ లు ఇవ్వటమే కాక తన కుమారుడుని తీసేసి రానాకి అవకాశమివ్వటం ఆయన భరించలేకున్నారని చెప్తున్నారు. అయితే వర్మ జరిగిన దానికి సారి చెప్పుకుని ఈ ప్రాజెక్టుని ఎట్టిపరిస్ధితుల్లోనూ ముందుకు తీసుకువెళ్ళాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. అంతేగాక తప్పనిసరి పరిస్ధితి అయితే అభిషేక్ ని మళ్లీ ప్రాజెక్టులోకి తీసుకుంటాని చెప్తున్నారు. అయితే అలా ఒకసారి బయిటకు వచ్చిన అభిషేక్ మళ్ళీ రామ్ గోపాల్ వర్మ తో చేయటానికి ఇష్టపడతాడా అనేది అందరి ముందున్న ప్రశ్న.
No comments:
Post a Comment