మగధీర విడుదలైన రెండేళ్లకి తమిళంలో దాని అనువాదాన్ని విడుదల చేస్తున్న అల్లు అరవింద్ చడీ చప్పుడు లేకుండా ఈ సినిమాని తోసేయడానికి చూడట్లేదు. రెండేళ్ల తర్వాత మేలుకున్నాకానీ హడావిడి గట్టిగానే చేస్తున్నాడు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. తమిళ చిత్ర ప్రముఖులు పలువురు హాజరు కాగా, సత్యసాయి బాబా మరణించడంతో చిరంజీవి ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా పుట్టపర్తి వెళ్లారు.
అయితే ఇంత ఆలస్యంగా విడుదల చేస్తున్న సినిమాకి ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారో అర్థం కాక తమిళ చిత్ర ప్రముఖులు అయోమయానికి గురయ్యారు. అయితే ఈ సినిమాకి ఇప్పుడింత హంగామా చేస్తున్నది రామ్ చరణ్ ని చల్లబరచడానికేనని అంటున్నారు. మగధీర తమిళ వెర్షన్ విడుదల చేయకపోవడం పట్ల చరణ్ చాలా కాలంగా అసహనంతో ఉన్నాడని, అతడిని కూల్ చేయడానికి అల్లు అరవింద్ ఇలా దొంగలు పడ్డ రెండేళ్లకి అలర్ట్ అయిన పోలీసులా విజిల్ ఊదుతున్నాడని చెప్పుకుంటున్నారు.
No comments:
Post a Comment