విజయవాడ: తానే తన భార్య అరుణను హత్య చేసినట్లు ప్రభాకర్ అనే వ్యక్తి అంగీకరించాడు. బుధవారం రాత్రి కృష్ణా జిల్లా బుద్ధవరం గ్రామంలో ప్రభాకర్ అనే వ్యక్తి భార్యను గొంతు కోసి హత్య చేసి, ఇద్దరు కూతుళ్లను కిడ్నాప్ చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఓ సంస్థలో నైట్ వాచ్‌మన్‌గా పనిచేస్తున్న ప్రభాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తానే తన భార్యను హత్య చేశానని ప్రభాకర్ విచారణలో అంగీకరించాడు. అంతేకాకుండా తన ఇద్దరు కూతుళ్లు శ్రావ్య, కావ్యలను కూడా తానే హత్య చేసినట్లు చెప్పాడు.
భార్యను గొంతు కోసి హత్య చేసిన ప్రభాకర్ పిల్లలను హత్య చేసిన వారి శవాలను కాలువలో పడేశాడు. కాలువ నుంచి పిల్లల శవాలను పోలీసులు వెలికి తీశారు. యాకూబ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల తాను తన భార్యను హత్య చేసినట్లు ప్రభాకర్ చెప్పాడు. రాత్రి కార్యాలయానికి వెళ్లినట్లు నటించి, వెనక్కి వచ్చి భార్యను, పిల్లలను ప్రభాకర్ హత్య చేశాడు. అరుణ ప్రభాకర్‌ను వదిలేసి గతంలో యాకూబ్‌తో వెళ్లిపోయింది. ప్రభాకర్ బతిలాడి తిరిగి ఆమెను తెచ్చుకున్నాడు. అయినా, యాకూబ్‌తో ఆమె తన సంబంధాన్ని వదులుకోలేదు. పైగా, తన ఇద్దరు కూతుళ్లలో ఓ కూతురు యాకూబ్ వల్లనే పుట్టినట్లు కూడా ప్రభాకర్ తెలుసుకున్నాడు. దీంతో భార్యను, పిల్లలను హత్య చేశానని ప్రభాకర్ అంగీకరించాడు.

No comments:
Post a Comment