ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులకు ఆరాధ్య దైవంగా మారిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జీవిత చరిత్రపై ఓ చిత్రం నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతోంది. సత్యసాయిబాబా పుట్టుక నుండి ఆయన తన పద్నాలుగేళ్లలో ఆధ్యాత్మిక వైపు మరలడం, ఆ తర్వాత తాను షిరిడీ సాయిబాబా అవతారంగా చెప్పడం, ఆ సమయంలో ఆయన మాటలు చేసి భక్తులకు కానుకలు సమర్పించడం ఆ తర్వాత ఆయన ప్రజలకు చేసిన సేవా కార్యక్రమాలు తదితర అంశాలను జోడిస్తూ త్వరలో చిత్రాన్ని నిర్మించే యోచనలో కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు హరిరామజోగయ్య నిర్మించనున్నారు. జోగయ్య గతంలో దేవుళ్లు చిత్రాన్ని కూడా నిర్మించారు.
ఈ చిత్రాన్ని బాబు పిక్చర్స్ పతాకంపై చేగొండి హరిరామ జోగయ్య దీనిని నిర్మిస్తున్నట్టుగా తెలుస్తోంది. జోగయ్యతో పాటు కరాటం రాంబాబు, తెలుగమ్మాయి నిర్మించిన వానపల్లి బాబురావు కూడా నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. కోడి రామకృష్ణ దీనికి దర్శకత్వం వహించనున్నారు. కాగా బాబా అంతిమ సంస్కారాల సందర్భంగా సత్యసాయి మహిమలు, సేవా కార్యక్రమాలపై సినిమా ఎందుకు నిర్మించకూడదనే ఆలోచన వచ్చినట్టు హరిరామ జోగయ్య చెప్పారు. ఆ వెంటనే కోడి రామకృష్ణను సంప్రతిస్తే ఆయన కూడా ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో 1994లో తాను మంత్రిగా ఉన్న సమయంలో బాబా వద్దకు తాను వెళ్లినప్పుడు వచ్చే ఎన్నికలలో కాంగ్రెసు గెలవడం కష్టమని చెప్పారని అలాగే జరిగిందని చెప్పారు. ట్రస్టు సభ్యుల సహకారంతో కథను రెడీ చేస్తున్నట్టు ఆయన చెప్పారు.
No comments:
Post a Comment