న్యూఢిల్లీ: ఓ మైనర్ బాలికపై ఆరుగురు యువకులు రాక్షసత్వానికి ఒడిగట్టారు. ఓ మైనర్ బాలికను ఆరుగురు యువకులు రెండు రోజుల పాటు గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఆరుగురిలో రాజేష్ అనే యువకుడు ఆ బాలిక మిత్రుడు. ఆ ఆరుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. తనపై అత్యాచారం జరిగిన తర్వాత బాధితురాలు తన మిత్రురాలితో కోట్లలో ఉంటోంది. ఆమెను కాపాడి తల్లిదండ్రులకు అప్పగించారు. గ్యాంగ్ రేప్‌నకు పాల్పడినవారిలో ఇద్దరు ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థులు కూడా ఉన్నారు.
గ్యాంగ్ రేప్ కేసులో అరెస్టయిన యువకులను రాజేష్ (21), అనిల్ (22), సిద్ధార్థ్ అలియాస్ సుధీర్ (20), ప్రతీక్ అలియాస్ సర్క్యూట్ (23), పింకు (22), తిలక్ అలియాస్ రాజా బాబు (23)గా గుర్తించారు. అండ్ర్యూస్ గంజ్‌లోని సీనియర్ అధికారులకు చెందిన సర్వెంట్స్ క్వార్టర్స్‌లో ఆ బాలిక తన కుటుంబ సభ్యులతో పాటు ఉంటోంది. తన కూతురు ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలిక తండ్రి ఈ నెల 25వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తనను వివేకానంద పార్కులో కలవాలని రాజేష్ ఆ బాలికకు చెప్పాడని, ఆమెను అక్కడి నుంచి సంగం విహార్‌లోని ఓ ఇంటికి తీసుకెళ్లాడని, అక్కడికి మిగతా వారు వచ్చారని, అక్కడే బాలికను వారు రేప్ చేశారని పోలీసు అధికారులు చెప్పారు. రేప్ చేసి ఆ బాలికను ఆమె ఇంటి వద్ద వదిలేశారని, అయితే భయంతో ఆమె ఇంటికి వెళ్లకుండా మిత్రురాలి ఇంటికి వెళ్లిందని చెప్పారు.

No comments:
Post a Comment