న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన మోటార్‌కేడ్‌ను
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కుమార్తె చెల్సియా క్లింటన్‌కు ఆఫర్
చేశాడు. కారణం చెల్సియా క్లింటన్ గర్బవతి కావడమే. మరికొద్ది రోజుల్లో
ప్రసవానికి సిద్దంగా ఉన్న చెల్సియా క్లింటన్ హాస్పిటల్‌కు వెళ్లే క్రమంలో
తన మోటార్‌కేడ్‌ను అవసరమైతే ఉపయోగించుకోవాల్సిందిగా 'క్లింటన్ గ్లోబల్
ఇనీషియేటివ్' సమావేశంలో బిల్ క్లింటన్‌తో మాట్లాడినట్లు వెల్లడించారు.
అమె ప్రసవించే సమయంలో హాస్పిటల్‌కు త్వరగా చేరుకోవడానికి... న్యూయార్క్
ట్రాఫిక్‌లో ఆలస్యం కాకుండా ఉండేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రపంచంలోకెల్లా అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో న్యూయార్క్ ఒకటి.
తన అధికారిక వాహనాలైతే, ఎక్కడా అడ్డంకుల్లేకుండా ముందుకు వెళతాయన్నది
ఒబామా ఆలోచన. అమెరికా అధ్యక్షుడి మోటార్‌కేడ్‌లో రెండు ఆయుధ సహిత లిమోసిన్
కార్లు, సీక్రెట్ సర్వీస్ సిబ్బంది వాహనాలు, ఇతర భద్రత సిబ్బంది వాహనాలు,
అధికారుల కోసం మినీ బస్సులు, మీడియా వాహనం, అంబులెన్స్ ఉండే విషయం
తెలిసిందే.
చెల్సియా క్లింటన్ జులై 31, 2010లో బ్యాంకర్ మార్క్ మెజ్నిస్కీని
పెళ్లాడారు. వీరి వివాహాం న్యూయార్క్‌లోని హుడ్సన్ రివర్ ప్రాంతంలో ఉన్న
ఆస్టర్ కోర్ట్స్‌లో జరిగింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్ దంపతులకు
చెల్సియా క్లింటన్ ఒక్కరే కుమార్తె. గతంలో హిల్లరీ క్లింటన్ సెక్రటరీ ఆఫ్
స్టేట్‌గా విధులను నిర్వహించారు. బిల్ క్లింటన్ సీఎన్ఎన్ ఛానల్‌తో అక్టోబర్
1వ తారీఖు లోపు తాను తాత కావడం ఖాయమని చెప్పినట్లు సమాచారం. అమెరికా మళ్లీ
అధ్యక్ష ఎన్నికలు జనవరి 2017లో జరగనున్నాయి.
source:news.oneindia.in
No comments:
Post a Comment