బెంగళూరు/లక్నో: కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ ట్యూషన్
మాస్టారు విద్యార్థిని పైన పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన సంఘటన
వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ సంఘటన హెచ్ఎస్ఆర్ లే అవుట్ పోలీసు స్టేషన్
పరిధిలో జరిగింది. విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు
చేశారు.
ఉత్తర ప్రదేశ్‌లో ఓ మైనర్ బాలిక అత్యాచారానికి గురయింది. ఈ సంఘటన బల్లియా
జిల్లాలోని రేవతి ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు నిందితుడిని
మంగళవారం అరెస్టు చేశారు. అతనిని జైలుకు పంపించారు.
సమాచారం మేరకు.. 12 ఏళ్ల బాలిక రేవతి పోలీసు స్టేషన్ పరిధిలోని ఉంటోంది.
ఈమె స్నాక్స్ కొనేందుకు ఓ దుకాణానికి వెళ్లింది. దుకాణానికి వెళ్లి తిరిగి
ఇంటికి వస్తున్న సమయంలో ఓ వ్యక్తి సైకిల్ పైన వచ్చాడు. ఇంటి వద్ద
దింపుతానని చెప్పాడు. అయితే, అతను ఆమెను ఎవరూ లేని ప్రాంతానికి తీసుకు
వెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
తమ కూతురు ఎంతకు రాకపోయేసరికి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆమె కోసం
వెతికారు. అపస్మారకస్థితిలో ఉన్న బాలికను చూశారు. విషయం తెలుసుకొని
పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని
అరెస్టు చేశారు. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
source:news.oneindia.in
No comments:
Post a Comment