దర్శకుడు, డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది. రెబల్ సినిమా వివాదానికి సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఈ కేసు నమోదుచేశారు. రెబల్ సినిమా నిర్మాణ సమయంలో నిర్మాతలు భగవాన్, పుల్లారావులతో లారెన్స్ కు ఒప్పందం కుదిరింది. 23 కోట్ల కంటే నిర్మాణ వ్యయం ఎక్కువైతే ఖర్చు భరించేందుకు లారెన్స్ ఒప్పుకున్నాడు. సినిమాకు అనుకున్నదానికంటే ఐదు కోట్లు ఎక్కువ ఖర్చు చేశారు. అదనంగా అయిన ఖర్చును తిరిగి ఇవ్వాలని నిర్మాతలు లారెన్స్ పై ఒత్తిడి తెచ్చారు. అయితే డబ్బు ఇచ్చేందుకు ఒప్పుకోకపోవడంతో నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. విచారణ నిమిత్తం పోలీసులు లారెన్స్ కోసం గాలిస్తున్నారు.
source:news.oneindia.in
No comments:
Post a Comment