న్యూఢిల్లీ: ఓ మైనర్ బాలికను రేప్ చేసి అబార్షన్ కోసం రూ. 2 లక్షలు
తీసుకోవాలంటూ పంచాయితీ పెద్దలు ఇచ్చిన తీర్పునిచ్చిన ఘటన బీహార్‌లో
జరిగింది. పోలీసులు వెల్లడించిన కధనం ప్రకారం బీహార్‌లోని ముజఫర్
జిల్లాలోని కంతి పోలీస్ స్టేషన్‌లో పరిధిలో సుబంకాపూర్ అనే గ్రామంలో ఈ ఘటన
చోటుచేసుకుంది.
అరుణ్ భగత్ అనే వ్యక్తి 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేయడంతో ఈ విషయం ఆ
గ్రామంలో ఉన్న పంచాయితీ వద్దకు వెళ్లింది. దీంతో పంచాయితీలో పెద్దలు
బాధితురాలికి రూ. 2 లక్షలు నష్ఠపరిహారంగా ఇవ్వమని చెప్పి, ఆ డబ్బు పెట్టి
బాధితురాలిని అబార్షన్ చేయించుకోవాల్సిందిగా తీర్పునిచ్చారు.
దీనిపై మండిపడ్డ బాధితురాలి తల్లిదండ్రులు మంగళవారం పంచాయితీ పెద్దలు
ఇచ్చిన తీర్పును కాదని, నిందితుడికి శిక్షపడాలంటూ పోలీసులను ఆశ్రయించారు.
రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు
తెలిపారు. ఈ కేసుపై ముజఫర్ సీనియర్ సూపర్‌డెంట్ ఆఫ్ పోలీస్ జితేంద్ర రాణా
మాట్లాడుతూ "మంగళవారమే కేసు నమోదు చేశామని, నిందితుడిని అతిత్వరలో
పట్టుకుంటామని, పంచాయితీ పెద్దలపై చర్య తీసుకుంటాం" అని అన్నారు.
source:news.oneindia.in
No comments:
Post a Comment