తిరుచ్చి పోలీసులు రీసెంట్ గా జరిపిన దాడిలో ఓ టాప్ హీరోయిన్ కి
చెందిన బ్లూ ఫిలిం సీడిలను పట్టుకున్నారు. పోలీసులు ఈ కేసులో ముగ్గురు ని
అరెస్టు చేసారు. ఇంకా ఎవరెవరికి ఈ కేసులో సంబంధం ఉందా అని ఎంక్వైరీ
చేస్తున్నారు. అయితే ఆ హీరోయిన్ ఎవరు అనేది మాత్రం టాప్ సీక్రెట్ గా
ఉంచారు. ఎందుకంటే అవి ఒరిజనల్ కాకపోతే ఆమె రిప్యుటేషన్ కి దెబ్బ తగిలే
అవకాశముందని చెప్తున్నారు. అలాగే ఆ సీడిలతో పాటు మరికొందరి హీరోయిన్స్
మార్ఫింగ్ పోర్న్ వీడియోలు కూడా దొరికాయని తెలియచేసారు.
ఇక మీడియా వారికి ఈ విషయం తెలియచేస్తూ త్వరలోనే దీని వెనక ఉన్న ముఠాలను
పట్టుకుని తీరుతామని, చాలా పెద్ద నెట్ వర్కే దీని వెనక పనిచేస్తోందని
అనుమానంగా ఉందని చెప్పారు. ఇప్పటికే కొన్ని టీమ్ లు ఈ పని మీద ఉన్నాయని
మీడియావారి ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. అలాగే ఫలానా హీరోయిన్ అని
ఊహాగానాలు సైతం చేయవద్దని వారు మీడియా వారిని కోరారు.
source:news.oneindia.in
No comments:
Post a Comment