హైదరాబాద్ : రామ్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో రూపొందుతున్న
చిత్రంలో మొదట అనుకుని,తర్వాత తప్పుకున్న హీరోయిన్ శుభా పుటేలా(21) నిన్న
(సోమవారం)సాయింత్రం మరణించింది. ఆమె గత కొద్దిరోజులుగా జాండీస్ తో
భాధపడుతోంది. ఆమె 2010 లో హెయిర్ ఓ మాక్స్ మిస్ సౌత్ ఇండియాగా కూడా
ఎంపికైంది. తర్వాత కొన్ని కమర్షియల్ యాడ్స్ లో నటించిన ఆమె తమిళంలోనూ
సినిమాలు చేసింది. ఇక రామ్ సినిమాతో ఆమెకు ఇక్కడ బ్రేక్ వస్తుందని
భావించింది. అయితే అనారోగ్య కారణంతో ఆమె ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.
రామ్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 'ఒంగోలుగిత్త' చిత్రం
చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ముందు శుభ పుతేలాని హీరోయిన్ గా అనుకున్నారు.
గుంటూరు మిర్చీ యార్డ్‌లో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగింది.
అయితే సినిమా అంతా మిర్చీ యార్డ్‌ల నేపథ్యంలో ఉండటం, ఆ వాతావరణం ఆమెకు
పడకపోవడంతో ఈ సినిమా నుంచి శుభ పుతేలా తప్పుకుంది. వైద్యులు ఆమెను రెండు
నెలలు రెస్టు తీసుకోమని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమెకోసం వెయిట్
చేయడం ఇష్టం లేక ఆమె స్థానంలో నిఖిత అనే కొత్త హీరోయిన్‌ను తీసుకోవాలని
అనుకున్నారు. అయితే ఆమె స్థానంలో నిఖితను అనుకున్నా చివరికి 'తీన్‌మార్'
ఫేమ్ కృతి కర్బందాను హీరోయిన్ గా తీసుకున్నారు.
ADVERTISEMENT
ఎంతో భవిష్యత్ ఉన్న ఆమె మరణం తీర్చలేనిదని ఇండస్ట్రీలో పలువురు సంతాపం
తెలియచేసారు. ధట్స్ తెలుగు శుభా పుటేలా ఆమె ఆత్మకు శాంతి కలగాలని
కోరుకుంటోంది.
source:news.oneindia.in
No comments:
Post a Comment