చిత్తూరు: అలిపిరి వద్ద నారా చంద్రబాబు నాయుడు పైన దాడి కేసులో ముగ్గురిని తిరుపతి అదనపు సెషన్స్ కోర్టు గురువారం దోషులుగా నిర్ధారించింది. ఈ కేసు పదకొండేళ్లుగా సాగింది. రామ్మోహన్ రెడ్డి, నరసింహా రెడ్డి, మాలచంద్రలను కోర్టు దోషులుగా నిర్ధారించింది. వారికి మధ్యాహ్నం శిక్షను ఖరారు చేసింది. దోషులకు నాలుగేళ్ల శిక్ష, రూ.500 జరిమానా విధించింది.
2003 అక్టోబర్ 1వ తేదీన నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న కారు పైన అలిపిరి వద్ద దాడి జరిగింది. ఈ కేసులో 35 మందిని నిందితులుగా పేర్కొన్నారు. వారి పైన కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి 2012లో గంగిరెడ్డిని హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
ఈ కేసు విచారణ పదకొండేళ్లు సాగింది. ఈ రోజు కోర్టు తీర్పు నేపథ్యంలో
సెషన్స్ కోర్టు వద్ద బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాటి దాడిలో చంద్రబాబు
సహా నాయకులు ప్రాణాలతో బయటపడ్డారు. 2003లో చంద్రబాబు కాన్వాయ్‌ను
నక్సలైట్లు పేల్చి వేసిన విషయం తెలిసిందే. 2011లోనే తిరుపతి సెషన్స్ కోర్టు
తొలి తీర్పు వెలువరించింది. దీనిపై నిందితులు హైకోర్టుకు వెళ్లారు.
ఇద్దరిని నిర్దోషులుగా హైకోర్టు ప్రకటించింది. ఇప్పుడు రెండో
ఛార్జీషీటులోని ముగ్గురిని దోషులుగా కోర్టు తేల్చింది.
source:news.oneindia.in
No comments:
Post a Comment