బెంగళూరు: స్థానిక టీవీ ఛానల్ నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్లో
పలువురు కన్నడ సినీ ప్రముఖులు సెక్స్ స్కాండల్‌లో దొరికి పోయారు. ఈ సెక్స్
స్కాండల్ టీవీల్లో ప్రసారం కావడం కన్నడ సినీ పరిశ్రమను ఒక్కసారిగా అతలా
కుతలం చేసినట్లయింది. రంగుల ప్రపంచంలోని చీకటి కోణాలు పలువురు సినీ
ప్రేమికులను షాక్‌కు గురి చేసాయి.
ప్రముఖ కన్నడ డైరెక్టర్స్ ఓం ప్రకాష్ రావు, గురుదేశ్ పాండే, నిర్మాతలు
దివాకర్ బాబు, గోవింద రాజు, ఆర్టిస్ట్-ఫ్యాషన్ కో ఆర్డినేటర్ రవి
బెల్లిచుక్కి, మంజా మరికొందరు సదరు టీవీ ఛానల్ కెమెరాకు రెడ్ హాండెడ్‌గా
దొరికిపోయారు. సమాజం తలదించుకునే విధంగా ఉన్న పలువురు ప్రముఖుల చర్యలు
ఉండటం గమనార్హం.
సినిమా హీరోయిన్లు కావాలకునే అమ్మాయిలను లోబరుచుకుని వారితో తమ లైంగిక వాంఛ
తీర్చుకుంటున్నట్లు ఈ స్ట్రింగ్ ఆఫరేషన్లో తేటతెల్లం అయింది. ప్రస్తుతం
కన్నడ సినీ పరిశ్రమలో ఉన్న చాలా మంది హీరోయిన్లతో తాను పడుకున్నట్లు ఓం
ప్రకాష్ రావు చెప్పినట్లు స్ట్రింగ్ ఆపరేషన్ వీడియోలో ఉంది. కొందరు
హీరోయిన్ల పేర్లు కూడా అతను చెప్పడం గమనార్హం. మరో దర్శకుడు గురు దేశ్
పాండే ఓ అమ్మాయికి ముద్దాడుతూ స్ట్రింగ్ ఆఫరేషన్లో దొరికిపోయాడు.
అయితే చాలా మంది కన్నడ సినీ ప్రముఖులు పరిశ్రమలో ఇలాంటిదేమీ జరుగడం లేదని
గత కొంతకాలంగా వాదిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా స్టింగ్ ఆపరేషన్లో
పరిశ్రమలోని చీకటి కోణాలు వెలుగులోకి వచ్చాయి.
source:news.oneindia.in
No comments:
Post a Comment