చదువు..వివాహం
అనసూయ హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదివింది. ఆమె సుశాంత్ భరధ్వాజ్ ని వివాహం
చేసుకుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమె జనవరి 23,1985 లో జన్మించింది.
హైదరాబాద్ : తెలుగులో ఉన్న యాంకర్ లలో హాట్ గా కనపడి వెంటనే
ఆకట్టుకునే వారు ఎవరంటే కళ్ళు మూసుకుని అనసూయ పేరే చెప్తారు. పెళ్ళై బిడ్డల
తల్లి అంటే నమ్మనట్లుగా ఉండే ఫిజిక్ తో తన మ్యాజికల్ నవ్వుతో బుల్లి తెర
ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటుంది.
ADVERTISEMENT
న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత బిందాస్, జబర్దస్త్ గేమ్
షోలకు వ్యాఖ్యాతగా, సినిమా ఫంక్షన్లకు యాంకరింగ్ చేస్తూ తన సత్తా చాటుతూ
ముందుకు సాగుతోంది. ఆ మధ్యన పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే విషయమై కామెంట్స్
చేసి మరీ అందరి దృష్టిలో మరోసారి పడింది. సినిమావాళ్లను సైతం ఆమె
ఆకర్షించినా ఆచి,తూచి తన బుల్లి తెరకెరీర్ పై ముందుకు వెళ్తోంది.
గతంలో ఆమె పవన్ కళ్యాణ్ తాజా చిత్రం చూసి సెన్సేషన్ కామెంట్స్ చేస్తూ ఆమె
అందరి దృష్టినీ ఆకర్షించింది. పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో
రూపొంది సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న 'అత్తారింటికి దారేది'
చిత్రంలో అనసూయను తీసుకోవాలనుకున్నారు. అయితే ఆమె అప్పట్లో రిజెక్ట్ చేసి
వార్తల్లోకి ఎక్కింది. అయితే సినిమా రిలీజయ్యాక తాను ఎందుకు నచించనన్నానో
అంటూ ట్వీట్ చేసి తన ఫ్యాన్స్ కు అసలు కారణం వివరించే ప్రయత్నం చేసింది.
source:news.oneindia.in
No comments:
Post a Comment