BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Thursday, September 25, 2014

పవన్ కళ్యాణ్ హీరోయిన్ పట్ల అధికారి అసభ్యంగా..!

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘తీన్ మార్' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన కృతి కర్బంద‌కు ఇటీవల బెంగులూరు ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్ ఇండియా ఆఫీసర్ ఆమె పట్ల అభ్యంతరకంగా ప్రవర్తించాడు. సదరు ఆఫీసర్‌పై పై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో ఆమె ఎయిర్ ఇండియాకు ఓపెన్ లెటర్ రాసింది.



కృతి కర్భంద లెటర్ లోని వివరాలు ఇలా ఉన్నాయి... ‘ఆగస్టు 16వ తేదీన బెంగుళూరు నుండి హైదరాబాద్‌కు ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. అదే వారంలో నేను సేమ్ ఫ్లైట్ బుక్ చేసుకోవడం ఇది రెండో సారి. సమయానికే ఎయిర్ పోర్టుకు చేరుకున్నాను. నా లగేజ్ వెయిట్ చెక్ చేసారు. 18.3 కేజీలు ఉంది. అక్కడ ఉన్న ఆఫీసర్ 15 కేజీల లిమిట్ కంటే 3 కేజీలు ఎక్కువగా ఉంది. అదనంగా డబ్బులు కట్టమని అడిగారు. రెండు రోజుల క్రితం సేమ్ ఫ్లైట్ వెళ్లినపుడు 20 కేజీల లిమిట్ అనుమతించారు. ఇదే విషయమై ఆయన్ను ప్రశ్నించారు. అయితే ఆ ఆఫీసర్ చాలా పొగరుగా సమాధానం ఇచ్చారు. కస్టమర్‌గా నాకు అడిగే హక్కు ఉంది. సమాధానం చెప్పాల్సిన బాధ్యత అతడికి ఉంది. తాను అడిగిన ప్రశ్నకు సరిగా సమాధానం చెప్పకుండా పొగరుగా, అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. ఇదే విషయం అక్కడి మేనేజర్ దృష్టికి కడా తీసుకెళ్లాను. కానీ వారు కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. నేనేదో నటి కాబట్టి ఈ ఫిర్యాదు చేయడం లేదు. ఒక సాధారణ మహిళగా ఈ లెటర్ రాస్తున్నాను. మరొక మహిళకు ఇలాంటి అనుభవం ఎదురు కాకూడదనే ఈ లెటర్ రాస్తున్నారు. కస్టమర్ల పట్ల సభ్యత లేకుండా ప్రవర్తించే అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలి' అంటూ కృతి కర్బంద తన లెటర్లో రాసారు.




source:news.oneindia.in

No comments:

Post a Comment