హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు సమీపంలో మంగళవారం
దారుణం వెలుగుచూసిన విషయం తెలిసిందే. బీటెక్ విద్యార్థిని పైన ఓ ఆటో
డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అతను అత్యాచారం దృశ్యాలను వీడియోలో
చిత్రీకరించాడు. రంగారెడ్డి జిల్లా కీసరలో సదరు బీటెక్ విద్యార్థిని పైన
ఆటో డ్రైవర్ అత్యాచారనికి పాల్పడ్డాడు. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు
పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఇంజనీరింగ్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేసిన సంఘటన అహ్మద్‌గూడలో
రాజీవ్‌గృహకల్పలో చోటుచేసుకుంది. అహ్మద్‌గూడ జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం కాలనీలో
నివసించే యువతి (19) మంగళవారం మధ్యాహ్నం ఘట్‌కేసర్‌లోని ఓ హాస్పిటల్‌లో
ఉంటున్న తమవారికి భోజనం తీసుకొని బయలుదేరింది.
బస్టాప్‌లో ఉన్న యువతిని నరేశ్ అనే ఆటోడ్రైవర్ ఎక్కడికి వెళ్తున్నావని
అడిగాడు. అతనితో ముందే పరిచయం ఉండటంతో ఘట్‌కేసర్‌కు వెళ్లాలని పేర్కొంది.
తాను ఘట్‌కేసర్ వెళ్తున్నానని చెప్పి ఆటోలో ఎక్కమని నమ్మబలికాడు. యువతిని
గృహకల్ప వైపు తీసుకెళ్లి ఓ అటవీ ప్రాంతం వైపుకు తీసుకు వెళ్లి అత్యాచారం
చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో దాడి చేశాడు. దృశ్యాలను వీడియోలో
చిత్రీకరించాడు. విషయాన్ని బయట చెబితే వీడియోను బహిర్గతం చేస్తానని
బెదిరించాడు. అనంతరం ఆమెను ఆసుపత్రికి సమీపంలో దించేసి పారిపోయాడు.
ఈ సంఘటన మంగళవారం ఉదయం పదిన్నర, పదకొండు గంటల మధ్య జరిగింది. బాధితురాలి
బీటెక్ ఫస్టియర్ విద్యార్థిని. జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. తాను
ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. అయితే, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు
చేశారు. పోలీసులు నిర్భయ కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం
గాలిస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి
పంపించారు.
నరేష్ అరెస్ట్
బీటెక్ విద్యార్థిని పైన అత్యాచారానికి పాల్పడిన ఆటో డ్రైవర్ నరేష్‌ను
పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
sorce:news.oneindia.in
sorce:news.oneindia.in
No comments:
Post a Comment