మెగా స్టార్ చిరంజీవిని ఎదిరించి మరీ తను ప్రేమించిన వాడినే పెళ్శి చేసుకున్నటువంటి చిరంజీవి చిన్న కూతురు గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది. దానికి కారణం చిరంజీవికి చిన్న అల్లుడు అయినటువంటి శిరీష్ భరద్వాజ్‌కు కూడా సమాజంలో చిరంజీవితో సమానంగా స్దాయిని కల్పించాలనే ఉద్దేశ్యంతో చిరంజీవి శిరీష్ భరద్వాజ్ కోసం రీజినల్ సెన్సార్ బోర్డ్ మెంబర్ చేయడానికి పూనుకున్నారు.
దీనిపై స్పందించినటువంటి శిరీష్ భరద్వాజ్ తనకి మొదటి నుంచి ఫిలిమ్స్ వైపు ఆసక్తి లేదని అదికాక ఇలాంటి రీజినల్ సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా పనిచేయడం వల్ల తనకి పెద్దగా వచ్చేది ఏమీ లేదని చిరంజీవిగారిని ఈవిషయంలో మన్నించమని కోరినట్లు సమాచారం. దాంతో ఈవిషయంలో ఫిలింనగర్‌లో ఏమి జరుగుతుందా అని కొంత ఆసక్తి ఏర్పడింది. ఇది మాత్రమే కాకుండా చిరంజీవిని డైరెక్టుగా శిరీష్ భరద్వాజ్ సినిమాలకు సంబంధించినటువంటి పోజిషన్స్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ లో ఏదైనా మంచి అఫీషియల్ పోస్టు ఏమైనా ఇప్పించండని కోరినట్లు సమాచారం.
ఈవిషయంపై చిరంజీవి శిరీష్ భరద్వాజ్‌కు అనుకూలంగా వ్యవహారించడానికి అవకాశాలు కూడా లేకపోలేదన్నారు. దానికి కారణం చిరంజీవి ఇటీవలే జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెసులోకి తాను స్దాపించినటువంటి ప్రజారాజ్యం విలీనం చేసిన విషయం తెలిసిందే. జాతీయ పార్టీతో సంబంధాలున్న చిరంజీవి అతనిని సెంట్రల్ గవర్నెమెంట్‌లో పోజిషన్ ఇప్పించడం పెద్ద కష్టం ఏమికాదని అంటున్నారు. అసలు ఇంతకీ శిరీష్ భరద్వాజ్ ఎటువంటి పోజిషన్ కావాలనేది ఒక్క శ్రీజ మాత్రమే సమాదానం చెప్పగలదు అనడంలో సందేహాం లేదు అంటున్నారు సన్నిహితులు.. దీనిని బట్టి అసలు విషయం ఏమిటంటే చిరంజీవి ఇచ్చినటువంటి రీజినల్ సెన్సార్ బోర్డ్ మెంబర్ పదవిని కాదని వేరే ఇంకేదో కావాలని చిరుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడన్నమాట..
No comments:
Post a Comment