రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం..అప్పల్రాజు. ఈ చిత్రంలో హీరో ఎవరి దగ్గరా అసెస్టెంట్ గా పనిచేయకుండా తానో కొత్త తరహా చిత్రం తీయాలనే ఆలోచనతో హైదరాబాద్ చేరిపోయి సినీ పరిశ్రమలో పడిపోతాడు. వర్మ కూడా ఎవరి దగ్గరా అసెస్టెంట్ గా పని చేయలేదు. ఈ నేపధ్యంలో ఈ పాత్ర ఆయన జీవితం నుంచే వచ్చిందా అనే సందేహం చాలా మందికి కలుగుతోంది. దానికి ఆయన సమాధానమిస్తూ...అప్పరాజులో హీరో పాత్ర నా వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండదు. అప్పల్రాజు నీతి నిజాయితీ ఉన్నవాడు. నేను మాత్రం మరో విధంగా ఉంటాను అన్నారు.
అలాగే అప్పల్రాజు గురించి చెప్పాలంటే ప్రతివాడు తానేదో గొప్ప సినిమా తీయాలని అనుకుంటాడు. అప్పల్రాజు కూడా అలాంటివాడే. కానీ సినిమా తీయటం ఎంత కష్టమో, సాంకేతిక నిపుణులను, నటులను సమన్వయం చేసుకుంటూ ఎలా వెళ్ళాలో, దాని వెనుక ఎన్ని బాధలు ఉంటాయో తెలుసుకుంటాడు అప్పల్రాజు. వినోదం కూడా పుష్కలంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నాకు ఎదురైన అనేక సంఘటనలను తీసుకొని ఈ చిత్రాన్ని నిర్మించాను.
ఇక నటులుగా, దర్శకులుగా విజయం సాధించాలని ఎంతోమంది ప్రయత్నాలు చేయడం అవి సఫలం కాకపోవడం నాకు తెలుసు. ఈ చిత్రం ఎవరిని గూర్చి ఆలోచించి తీసింది మాత్రం కాదు. ఈ చిత్రం చూసాక మాత్రం అందరూ ఆలోచిస్తారు. ఈ చిత్రాన్ని నేను ఎందుకోసం తీసానో అని ప్రత్యేకంగా అంటే మాత్రం జవాబు లేదు. తీయాలనిపించింది, తీసాను. వేరే ఉద్దేశం ఏమీ లేదు అని తేల్చారు.
అప్పల్రాజు పాత్రలో సునీల్ కనిపిస్తాడు. ఇక స్వాతి, సాక్షి హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆదర్శ్, కృష్ణుడు, వేణుమాధవ్, అలీ, తనికెళ్ల భరణి, చలపతిరావు తదితరులు నటిస్తున్నారు. సమర్పణ: వందిత కోనేరు, కెమెరా: సుధాకర్ యెక్కంటి, సహ నిర్మాత: సుమన్ వర్మ.
No comments:
Post a Comment