రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సంగీతం, నృత్యం వంటి కళలకు ప్రోత్సాహం కల్పించి, తెలుగు, సంస్కృతి, సాంప్రదాయాలను పునర్జీవం చేయాలనే ఉద్దేశంతో టి సుబ్బిరామి రెడ్డి లలిత కళా పరిషత్ వివిధ కార్యక్రమాలను చేపట్టింది. అందులో భాగంగా ఈ నెల విజయవాడ జోన్ ను ప్రారంభిస్తున్నామని వ్యవస్థాపక అధ్యక్షలు ఎంపీ సుబ్బిరామి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జునను నట కళారత్న బిరుదుతో సత్కరించాలని టి.సుబ్బిరామిరెడ్డి లలితకళాపరిషత్ నిర్ణయించింది. ఈ నెల 26న విజయవాడ లోని లయోలా కళాశాల ఆడిటోరియంలో నిర్వహించే సంగీత, నృత్య ఉత్సవాల సందర్భంగా నాగార్జునకు ఈ బిరుదు ప్రధానం చేయనుంది.
ఈ సందర్భంగా సినీదర్శకులు కే.రాఘవెంద్రరావు నటీమణులు స్నేహా, ఛార్మి, అర్చన తదితరులను ఘనంగా సన్మానిస్తామని కళాపరిషత్ చైర్మన్ టి.సుబ్బిరామిరెడ్డి తెలిపారు. పాతికేళ్ళ నాగార్జున సినీ జీవితంలో ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ తన విజ్ఞప్తి మేరకు ఈ అవార్డు అందుకుంటానికి అంగీకరించాడని సుబ్బిరామిరెడ్డి పేర్కొన్నారు.
No comments:
Post a Comment