ఒకరిలా మనం కూడా నటించాలి అనుకోకూడదు. మన దారిలో మనం వెళ్లాలి. ప్రారంభం రోజుల్లో అది సాధ్యం కాకపోవచ్చు. మెల్లమెల్లగా మనదైన శైలిని సృష్టించుకోవాలి అంది. తాను ప్రస్తుతం అదే ప్రయత్నాల్లోనే ఉన్నానంది.. అని చెప్పింది. శ్రుతీ హాసన్. ఆమె తాజాగా మీడియాతో మాట్లాడుతూ...మనకంటూ ఈ పరిశ్రమలో ఏదో ఒక స్థానం దక్కితే చాలు అనుకోవాలి. అప్పుడే ఈ పరిశ్రమలో ఎదరయ్యే ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే ధైర్యం వస్తుంది అంది.
అలాగే తన ఆఫర్స్ గురించి చెబుతూ...తమిళంలో మురుగన్‌దాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. అందులో సూర్యకు జోడీగా కనిపిస్తాను. తెలుగులో మరో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. ప్రస్తుతం కథలు వింటున్నాను. పాత్ర నచ్చితే దర్శకుడు ఎవరైనా సరే...గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాను అంటోంది. ఇక ఆమె ఎన్టీఆర్ సరసన బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందే గర్జన, మహేష్, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందే ది బిజెనెస్ మేన్ చిత్రాలు కమిటైంది.
No comments:
Post a Comment