హైదరాబాద్: హైదరాబాదులోని కూకట్‌పల్లిలో శనివారం రాత్రి జరిగిన హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. మిత్రుడే ఆ వ్యక్తిని హత్య చేసినట్లు గుర్తించారు. వాలైంటైన్స్ డే సందర్భంగా తన ప్రియురాలికి బహుమతి కొని ఇచ్చేందుకు 20 రూపాయలు ఇవ్వలేదని భరద్వాజ్ అనే వ్యక్తి తన మిత్రుడు కరుణాకర్‌ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. బండరాళ్లతో దారుణంగా మోది కిరాతకంగా హత్య చేసినట్లు వారు చెప్పారు.
పోలీసుల కథనం ప్రకారం - కరుణాకర్, భరద్వాజ్ మిత్రులు. వారిద్దరు ఓ కల్లు కాంపౌండ్‌లో విపరీతంగా తాగారు. భరద్వాజ్ కరుణాకర్‌ను 20 రూపాయలు అడిగాడు. కరుణాకర్ ఇవ్వలేదు. తన ప్రియురాలికి బహుమతి ఇవ్వడానికి డబ్బులు అడిగితే నిరాకరించడనే కోపంతో భరద్వాజ్ అతన్ని హత్య చేశాడు. హత్య తర్వాత భరద్వాజ్ పారిపోయాడు. సెల్‌ఫోన్ ఆధారంగా పోలీసులు నిందితుడ్ని గుర్తించారు.
No comments:
Post a Comment