BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Wednesday, February 16, 2011

అలాంటి సినిమాలకు కూడా రెడీ అయిన ఆర్తి అగర్వాల్

Aarthi Agarwalసాధారణంగా సినిమా హీరోయిన్స్ ఫేడవుట్ అయిన దశలో ఏదో ఒక పాత్ర అనుకుంటూ ఏ టీవీ సీరియల్స్ కో లేక అక్కా చెల్లెళ్ళ పాత్రలకో జంప్ అవుతూంటారు. అయితే కొందరు మొదటి నుంచి సీ గ్రేడ్ సినిమాలకు అలవాటు పడి అడవిలో అందగత్తెలు, రామచిలకలు వంటి చిత్రాలలో నటిస్తూంటారు. ప్రస్తుతం ఆర్తి అగర్వాల్ పరిస్ధితి ఆ స్ధితికి చేరినట్లుంది. ఆమె తాజాగా ఒప్పుకునే చిత్రాలు చూస్తున్న వారు నువ్వు నాకు నచ్చావ్ లాంటి చిత్రాలు చేసిన ఆమె ‘వనకన్య - వండర్ బాయ్స్’ లాంటి చిత్రాలు కమిటవటం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ ‘వనకన్య - వండర్ బాయ్స్’ చిత్రం శ్రీరాఘవేంద్ర సినీపతాకంపై శివనాగు దర్శకత్వంలో జాలాది శివశంకర్ రావు చౌదరి నిర్మిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివనాగు.

No comments:

Post a Comment