BREAKING NEWS
Wednesday, February 16, 2011
'అలా మొదలైంది' చిత్రం అంత హిట్టవుతుంది...నిత్యా మీనన్
అలా మొదలైంది చిత్రానికి వచ్చినంత గుర్తింపు నాకు మళ్లీ ఈ సినిమాతో లభిస్తుంది. ఈ సినిమా కూడా ఆ రేంజి హిట్టవుతుంది అంటోంది నిత్యమీనన్.ఆమె తాజాగా సిద్దార్ధ సరసన 180 అనే చిత్రంలో చేస్తోంది. నిత్యమీనన్, ప్రియాఆనంద్ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రంకి ఈ వయసిక రాదు - అనేది ట్యాగ్ లైన్. ఎస్‌పీఎల్ సినిమా ప్రై.లి., అఘల్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జయేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ ఫైనల్ స్టేజస్ కి చేరుకొంది. వేసవిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే నిత్యా మీన్ ...దేవకట్టా దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందే ఆటో నగర్ సూర్య చిత్రంలోనూ హీరోయిన్ గా బుక్కయింది.చిత్రం మార్చి నుంచి షూటింగ్ కి వెళ్ళనుంది. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment