BREAKING NEWS
Wednesday, February 16, 2011
'గగనం' విషయంలో ప్రకాష్ రాజ్ కి మాజీ భార్యే సేవ్ చేసింది
ప్రకాష్ రాజ్ నటిస్తూ నిర్మించిన గగనం(తమిళంలో పయినం) చిత్రం విషయంలో ఆయన మాజీ భార్య లలిత కుమారి కి ధాంక్స్ చెప్పుకున్నారు. ఈ చిత్రం రిలీజ్ సమయంలో లలిత చేసిన మేలు మరవలేను అని ఆయన మీడియాతో అన్నారు. ఆయన ఈ విషయం ప్రస్దావిస్తూ...గగనం ఫైనాన్సియర్ ఒకరు రిలీజ్ సమయంలో ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఇబ్బందిపెడదాముకున్నాడు. అంతేగాక నన్ను దెబ్బ తీయటానికి నా మాజీ భార్య లలిత దగ్గరకు వెళ్ళి ఆమె సపోర్టు అడిగాడు. మా వివాహ విషయాన్ని కాంట్రావర్శి చేసి నన్ను బెదిరించాలనుకున్నాడు.అయితే లలిత అతన్ని ఎంటర్టైన్ చేయలేదు. తాను నిక్కిచ్చిగా అటువంటి విషయాల్లో తల దూర్చనని చెప్పి నాకు సపోర్టుగా నిలిచింది అన్నారు. ఆమెతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఇలాంటి సపోర్టు రావటం తాను ఊహించలేదని అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment