గతంలో రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి సినిమాలు గనుక మనము చూసినట్లైతే హీరోయిన్‌గా నటించినటువంటి వాళ్శు అందాలను చాలా ఎక్కువగా ఎక్స్ పోజ్ చేసిన వాళ్లే. ఐతే విడుదలకు సిద్దంగా ఉన్నటువంటి కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం..అప్పలరాజు విషయంలో మాత్రం అలా జరగలేదని అంటున్నారు రాము. దానికి కారణం ఈసినిమాలో హీరోయిన్‌గా నటించినటువంటి స్వాతికి, హీరో సునీల్‌కి మద్య రోమాన్స్ చేయించడానికి స్కిప్టు అలాంటిది కాదని అన్నారు.
దీనిపై స్వాతి స్నేహితులు మాత్రం స్వాతిని ఆకాశానికి ఎత్తి వేస్తున్నారంట. దానికి కారణం రామ్ గోపాల్ వర్మ సినిమాలో నటించిన నువ్వు ఎలాంటి ఎక్స్ పోజింగ్, రోమాన్స్ లేకుండా బయటకు రావడమే మాటలు కాదు అని అంటున్నారు. అసలు నువ్వు ఆయన చేతుల్లో నుండి ఇంత సేఫ్ గా బయటకు వస్తావని మేము ఎవరం కూడా ఊహించేలేదని అన్నారని సమాచారం. ఏది ఏమైనాగాని సినిమా విడుదలైతే గాని ఏవిషయం చెప్పలేమని అంటున్నారు సినీ పండితులు.
No comments:
Post a Comment