సినిమా రంగం తనకు పెద్దగా అచ్చిరాకపోవచ్చని మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడో, లేక సినిమారంగంలో తను సంపాదించబోయే ఎనలేని పేరు ప్రఖ్యాతులు వృధా చేయకూడదన్న ముందస్తు ప్రణాళికో మనకు తెలియదు కానీ.. హీరో రామ్ అప్పుడే రాజకీయాల వైపు దృష్టి సారించేస్తున్నాడు. ప్రస్తుత రాజకీయనాయకుల్లో నమ్మదగిని రాజకీయనాకుడు లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ మాత్రమేనని ప్రకటించిపారేసాడు. అయితే, అలా అని తనకు రాజకీయాలంటే యమ ఇంట్రెస్టేమోనని అనుకుంటే పప్పులో కాలేసినట్టేనని వివరణ కూడా ఇచ్చుకున్నాడు.
అయితే సమయం సందర్భంలేకుండా..పనిగట్టుకుని లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ పై ఎక్కడలేని ప్రేమాభిమానాలు ఒకకబోయడం పలు సందేహాలకు తావిస్తోంది. ‘దేవదాసు’, ‘రెడీ’ మినహా మరో హిట్టులేని రామ్ ..రాజకీయాల గురించో మరొక దాని గురించో దృష్టి పెట్టి టైమ్ బేస్ట్ చేసుకోకుండా, మూడో హిట్టు కొట్టడంపై మనసు పెట్టడం మంచిదని అతని శ్రేయోభిలాషులు సలహా ఇస్తున్నారు. మరి ఈ ఉచిత సలహాని రామ్ ఎంతవరకు పాటిస్తాడో చూడాలి..
No comments:
Post a Comment