రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం...అప్పల్రాజు ఈ నెల 18వ తేదీ శుక్రవారం విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అంతకుముందు రోజు రాత్రి అంటే 17వ తేదీ రాత్రి ప్రసాద్ మల్టి ప్లెక్స్ లోని అన్ని స్క్రీన్స్ లో ప్రీమియర్ షో వేయనున్నారు. ఈ మెగా ప్రీమియర్ షో ని ఆర్గనైజ్ చేస్తున్నది కళామందిర్ కళ్యాణ్. ఈ ప్రీమియర్ షో కి ఇండస్ట్రీలోని పెద్దలు, ఆహ్వానితులు మరియు చిత్రంకి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ హాజరుకానున్నారు. ఇక తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఈ చిత్రం కోసం ఎదురు చూస్తోంది. ఎందుకంటే ఈ చిత్రంలో టాలీవుడ్ లోని చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిపై సెటైర్స్ ఉన్నాయి.
ఇక ఈ చిత్ర కథ ప్రకారం...అమలాపురం అప్పల్రాజుకి సినిమాయే లోకం. విడుదలైన ప్రతి సినిమా చూడాల్సిందే. అందులోని కథనీ, హీరోల యాక్షన్నీ, డైరక్టర్లు తీసిన విధానాన్నీ చీల్చి చెండాడాల్సిందే. ఆ దర్శకుల కంటే తనెంత బాగా తీసేవాణ్నో కనబడ్డ ప్రతి ఒక్కరికీ చెప్పాల్సిందే. ఇక తన మీద తనకు నమ్మకం పెరిగిపోయాక హైదరాబాద్ వచ్చేసి ఫిల్మ్‌నగర్లో వాలిపోయాడు అప్పల్రాజు. ఆ తరవాత అతని సినిమా కల ఏ విధంగా నెరవేరిందో వెండి తెరపై చూడాల్సిందే. అప్పల్రాజు పాత్రలో సునీల్ కనిపిస్తాడు. ఇక స్వాతి, సాక్షి హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆదర్శ్, కృష్ణుడు, వేణుమాధవ్, అలీ, తనికెళ్ల భరణి, చలపతిరావు తదితరులు నటిస్తున్నారు. సమర్పణ: వందిత కోనేరు, కెమెరా: సుధాకర్ యెక్కంటి, సహ నిర్మాత: సుమన్ వర్మ.
No comments:
Post a Comment