లెజండరీ డైరెక్టర్ కె విశ్వనాధ్ మొన్నామద్య తీసినటువంటి సినిమాలో హోమ్లీ ఫిగర్‌గా తెలుగు సినిమా ప్రేక్షకులు గుండెల్లో అలా నిలచిపోయింది మంజరి ఫడ్నిస్. ఆసినిమా తర్వాత మంజరికి తెలుగు సినిమా ప్రేక్షకులకు దగ్గరవ్వడానికి సినిమాలే లేకుండా పోయాయి. మరలా తన నటనా కౌశలాన్ని నిరూపించుకునేందుకు జూ ఎన్టీఆర్ రూపంలో వెతుక్కుంటూ మరో అవకాశం తన తలుపు తట్టింది. ఏంటా ఆఅవకాశం అని అనుకుంటున్నారా..శక్తి సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించే అవకాశం.. ఈవార్త తెలుసుకున్న మంజరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయని అనడంలో సందేహాం లేదు.
దీంతో మంజరి డైరిలో ఇప్పటి వరకు ఇలాంటి బెస్ట్ ఆఫర్ రాలేదని చెప్పడంలో ఎటువంటి సందేహాం లేదు. దానికి కారణం ఈసినిమాని అశ్వినిదత్ ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి మరీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈసినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. జూ ఎన్టీఆర్ స్వయంగా మంజరి ఐతే ఆ క్యారెక్టర్‌కి కరెక్టుగా సరిపోతుంది అని అనడంలో మంజరి ఫడ్నిస్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయని సమాచారం. ఇది మాత్రమే కాకుండా కలలో కూడా ఇలాంటి అవకాశం తనకి వస్తుందని ఊహించి ఉండదు. ప్రస్తుతం తెలుగు ఇండస్టీలో టాప్ ప్లేసులో దూసుకుపోతున్న జూ ఎన్టీఆర్ ప్రక్కన అవకాశం మాటలు కాదు అని అంటున్నారు సినీ పండితులు.
ఇక ఈసినిమాలో మంజరి ఫడ్నిస్ క్యారెక్టర్ విషయానికి వస్తే ఈజిప్ట్ ప్రిన్సెస్‌గా పూజా బేడి నటిస్తుండగా ఆమె కూతురుగా మంజరి ఫఢ్నిస్ నటిస్తున్నారని సమాచారం. ఇకపోతే ఈసినిమాలో జూ ఎన్టీఆర్ ఓ ప్రత్యేకమైన ఆయుధం కోసం వెతుక్కుంటూ దేశంలోని పలు ప్రాంతాలను సందర్శించడం జరుగుతుందని సమాచారం. చివరకు ఆ ఆయుధాన్ని జూ ఎన్టీఆర్ ఎలా సంపాదించారనే ఇతివృత్తం ఆధారంగా కధ సాగుతుందని సమాచారం. ఈదెబ్బతో మంజరి ఫడ్నిస్ దశ కూడా తిరుగుతుందని భావిస్తున్నారు.
ఇప్పటికే మార్కెట్ లోకి విడుదలైనటువంటి శక్తి సినిమా వాల్ పేపర్స్ హాల్ చల్ సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈసినిమా ఆడియో కార్యక్రమాన్ని ఈనెల 27వ తారీఖున అంగరంగ వైభవంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు. సినిమాని మార్చి 30న విడుదలే చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు
No comments:
Post a Comment