BREAKING NEWS
Wednesday, February 16, 2011
వెంకటేష్ సినిమాని కబ్జా చేసిన రాణా దగ్గుపాటి
వెంకటేష్, తేజ కాంబినేషన్ లో సావిత్రి అనే చిత్రం రూపొందుతోందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా ప్రాజెక్టుని రాణా చేస్తున్నారని సమాచారం. సబ్జెక్టు బాగా నచ్చటంతో రాణా ఇంట్రస్టు చూపెట్టాడని దాంతో వెంకటేష్ తప్పుకున్నాడని తెలుస్తోంది. అంతేగాక సావిత్రిలోని పాయింట్ కు వెంకటేష్ మొదటి నుంచీ పెద్దగా అసక్తి చూపలేదని, సురేష్ బాబు పట్టుదలపైనే సబ్జెక్టుని రెడీ చేయటం జరిగిందని చెప్తున్నారు. తేజ కూడా యంగ్ హీరోలను డీల్ చేసి హిట్ కొట్టిన చరిత్ర ఉండటం కూడా ఈ నిర్ణయానికి ఊతమిచ్చినట్లయింది. ఇక ఈ చిత్రం టైటిల్ ని బట్టి హీరోయిన్ ఓరియెంటెడ్ గా కథ నడుస్తుందని, హీరో ది చంటి తరహా క్యారెక్టర్ ని ఫిల్మ్ సర్కిల్సో లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాణా..నేను నా రాక్షసి చిత్రం చేసి విడుదల కోసం చూస్తున్నాడు. ఇలియానా హీరోయిన్ గా చేసిన ఆ చిత్రాన్ని పూరి జగన్నాధ్ డైరక్ట్ చేసారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment