BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Monday, February 14, 2011

బాబాయ్, అబ్బాయిలకు ప్రజలే బుద్ధి చెప్తారు: చంద్రబాబు ధ్వజం

Chandrababu Naiduకడప: కడప జిల్లాలో వైఎస్ వివేకానందరెడ్డి, జగన్ (బాబాయ్, అబ్బాయ్)ల రాజకీయాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు. 2004 ఎన్నికల ముందు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఆయన కుటుంబాల ఆస్తులు ఎంత? ప్రస్తుతం ఉన్న ఆస్తులు ఎంతని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్‌కు ముఖ్యమంత్రి పదవి ఇస్తే కొత్త పార్టీ పేట్టేవాడా అంటూ బాబు ఆరోపించారు.

దేశంలో, రాష్ట్రంలో సంపదను కొన్ని కుటుంబాలే దోచుకుంటున్నాయని బాబు విమర్శించారు. సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు అంకాలమ్మ గూడూరులో రోడ్ షో నిర్వహించారు. చిత్రావతి-లింగాల ప్రాజెక్టు పనులకోసం వైఎస్ వెయ్యి కోట్ల రూపాయల ఖర్చుపెట్టారు తప్ప ఒక్క ఎకరాకు నీరివ్వలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో చేనేత పరిశ్రమ చితికిపోతున్నది, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

మరోవైపు నిత్యావసర ధరలు పెరుగుతున్నా పేదవాడి ఆదాయం మాత్రం పెరగడంలేదని చంద్రబాబు తెలిపారు. ధరలను అదుపుచేయలేని ఈ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని ఆయన డిమాండ్ చేశారు. సూక్ష్మ రుణ సంస్థలకు ఎవరూ రుణాలు కట్టవద్దని, మీకు అండగా టీడీపీ ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. సామాజిక న్యాయం అంటూ, కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించిన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయినా, అందులో చిరంజీవి ఏమీ సాధించలేరని బాబు విమర్శించారు. కాగా పులివెందులలో బహిరంగ సభ నిర్వహించడానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బాబు వారిపై మండిపడ్డారు. జిల్లా ఆయన పర్యటన రెండు రోజులపాటు సాగుతుంది.

No comments:

Post a Comment