న్యూఢిల్లీ: రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుపై మరోసారి ప్రత్యక్ష యుద్ధం ప్రకటించారు. రామోజీరావుకు చెందిన మార్గదర్శి సంస్థపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఆర్‌బిఐ గవర్నర్‌కు లేఖ ఇచ్చారు. రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థలో భారత రిజర్వు బ్యాంక్ రూల్సును పాటించడం లేదని, ఆర్‌బిఐ నిబంధనలకు వ్యతిరేకంగా నడిపిస్తున్నారంటూ ఆయన ఆరోపిస్తూ ఆర్‌బిఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావును సోమవారం కలిశారు.
నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న మార్గదర్శిపై చర్యలు తీసుకోవాలని ఆయన దువ్వూరిని కోరారు. గతంలోనే తాను మార్గదర్శిపై ఆర్‌బిఐ దృష్టికి తీసుకు వచ్చానని చెప్పారు. సాధ్యమైనంత తొందరగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఉండవల్లి నాలుగు పేజీల లేఖను దువ్వూరికి ఇచ్చారు. ఉండవల్లి అరుణ్‌కుమార్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రామోజీరావును లక్ష్యంగా పలుమార్లు విమర్శలు గుప్పించారు. మార్గదర్శిపై చర్యలు తీసుకోవాలంటూ లేఖలు రాశారు. అయితే వైఎస్ మరణం అనంతరం ఆయన సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మళ్లీ రామోజీరావుపై ప్రత్యక్ష యుద్ధానికి దిగారు.
No comments:
Post a Comment