రాజమండ్రి: కొత్తగా పుట్టుకు వస్తున్న పార్టీలో గత సాధారణ ఎన్నికల్లో మేం తెచ్చుకున్న ఓట్లు, సీట్లను తెచ్చుకోగలవా అంటూ ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి సోమవారం మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా సవాల్ విసిరారు. ఇప్పుడు పార్టీని వీడుతున్న వారంతా నా అభిమానుల వల్లే నాయకులుగా గుర్తింపు పొందారని ఆయన అన్నారు. నా అభిమానుల వల్ల నాయకులుగా గుర్తింపు పొంది ఇప్పుడు అభిమానుల కోరిక మేరకు నడుచుకోక పోవడం విచారకరమన్నారు. కార్యకర్తలకు, తనకూ మధ్య దూరాన్ని పెంచేందుకు ఓ వర్గం మీడియా ప్రయత్నాలు చేస్తుందన్నారు.
ప్రభుత్వాన్ని ఆదుకునేందుకే ఆపద్బాంధవుడి అవతారం ఎత్తానని ఆయన చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని చెప్పారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడాన్ని అందరూ ఆహ్వానిస్తున్నారన్నారు. స్వార్థంతో విమర్శించే వారిని మేం పట్టించుకోమని చెప్పారు. వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. కొత్తగా వచ్చిన పార్టీ 18 సీట్లు గెలుచుకోవడం సాధారణ విషయం కాదన్నారు.
No comments:
Post a Comment