BREAKING NEWS
Monday, February 14, 2011
నట్టికుమార్ నా దృష్టిలో గొప్ప నిర్మాత...జగపతి బాబు
నట్టికుమార్ మార్కెట్ తెలిసిన నిర్మాత. ఎక్కడ డబ్బు వృథా అవుతుందో తెలుసుకుని దాన్ని నియంత్రించడం తెలిసిన వ్యక్తి. నా దృష్టిలో పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్. నేను నటించే 100వ సినిమా కూడా ఈ ఏడాది తప్పక ప్రారంభమవుతుంది. నట్టికుమారే ఆ సినిమాను నిర్మిస్తానని అంటున్నారు అంటూ నట్టికుమార్ గురించి చెప్తున్నారు జగపతిబాబు. ఆయన నట్టికుమార్ నిర్మాతగా చట్టు,బ్లాక్ మనీ చిత్రాలు చేస్తున్నారు. అలాగే తన రీసెంట్ ఫెయిల్యూర్ గాయం 2 గురించి చెబుతూ...'గాయం-2' మంచి సినిమానే. కానీ కాస్ట్ ఫెయిల్యూర్. ఆ సినిమాకి ప్రొడక్షన్ మొత్తం నేనే చూశా. ఎప్పుడూ అంటుంటాను కదా. బ్యాడ్ బిజినెస్ మేన్‌ని అని. ఆ మాటని ఆ సినిమా మరోసారి నిజం చేసింది అన్నారు. అంతేగాదు ప్రేక్షకులకు రిలీఫ్ కోసమని బలవంతంగా పాటల్ని, ఫైట్లను చొప్పించే పద్ధతికి ఇక స్వస్తి చెప్పాలనుకుంటున్నా. మరీ సన్నివేశం బలంగా ఉంటే తప్ప తూతూ మంత్రంగా పాటలను పూర్తి చేయడం వృథా. ఫైట్లు పెట్టవద్దని నా దర్శక, నిర్మాతలకు క్లియర్ గా చెప్తున్నా అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment