గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీస్ నిర్మాతగా మారనున్నాడా..?అవుననే సంకేతాలు అందుతున్నాయి. ప్రస్తుతం అల్లు అరవింద్ పెద్ద కొడుకు వెంకటేష్ గీత ఆర్ట్స్ వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూ ఉండగా రెండో కొడుకు అల్లు అర్జున్ హీరోగా నిరూపొంచుకున్నాడు. చిన్న కొడుకు అల్లు శిరీష్ ప్రస్తుతం సౌత్ స్కోప్ అనే ఇంగ్లీష్ మ్యాగజైన్ ను నెలకొల్సి విజయవంతంగా నడిపిస్తున్నాడు. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో రానున్న కాలంలో పూర్తిస్థాయి నిర్మాతగా మారేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నాడు. అని సమాచారం.
గతంలో గీతా ఆర్ట్స్ అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నిర్మించిన మిందీ చిత్రం ‘గజినీ’ కి సంబంధించి ప్రొడక్షన్ వ్యవహారాలన్నీ శిరీష్ దగ్గరుండి చూసుకున్నాడు. అలాగే సినిమా నిర్మాణంపై మరియు పంపిణి వ్యవస్థ మీద అతనికి ఉన్న అవగాహన ట్విట్టర్ లో శిరీష్ పోస్ట్ చేస్తున్న సమాచారాన్ని బట్టి తెలుసుకోవచ్చు. కాకపోతే అతను ఎవరితో, ఎప్పుడు సినిమా మొదలు పెడగాడు వంటి విషయాలు తెలుసుకోవటానికి మరి కొంత సమయం వేచి చూడాలి.
No comments:
Post a Comment