కడప: తన కొత్త పార్టీని మార్చి నెలలోనే ప్రారంభిస్తున్నట్లు మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ చెప్పారు. కడప జిల్లాలోని పులివెందులలో గల వైయస్సార్ సమాధి వద్ద తన పార్టీని ప్రకటిస్తానని ఆయన చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పథకాలను విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో పడేసినా సిగ్గురాదని ఆయన అన్నారు.
సోమవారం ఆయన బద్వేల్‌లో సభలో మాట్లాడారు. త్వరలోనే వైఎస్‌ఆర్ స్వర్ణయుగం వస్తుందన్నారు. ఆ పాలన ముప్పయి ఏళ్లపాటు కొనసాగుతుందని జగన్ తెలిపారు. ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ పాదాల చెంత మార్చిలోపేదల పార్టీ ఆవిర్భవిస్తుందన్నారు. పేదల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెసు పేర వైయస్ జగన్ తన కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
No comments:
Post a Comment