ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Monday, February 14, 2011
అప్పలరాజు చిత్రంలో వర్మ వాయిస్ ఓవర్ లో ...
మొన్న రక్త చరిత్ర చిత్రంతో తన వాయిస్ తో నేరాలు-ఘోరాలు ని మరపించిన రామ్ గోపాల్ వర్మ తాజాగా మరోసారి తన వాయిస్ ని వినిపించటానికి రెడీ అవుతున్నారు. ఆయన తాజా చిత్రం కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం ...అప్పలరాజు లో ఆయన మొదట ఓ ఉపోద్ఘాతం ఇస్తారు.తెర మీద బొమ్మ పడగానే వర్మ గొంతు వినిపిస్తుంది. ఆ ఉపోద్ఘాతం లో 'ఇది కామెడీ సినిమా - కాసేపు నవ్వుకొందాం అని వస్తే సారీ...' అంటూ సినిమా జెనర్ గురించి ముందుగా చెప్పి ప్రిపేర్ చేస్తారు.
ఇక ఫిల్మ్‌నగర్‌లో అప్పల్రాజు చేసిన ప్రయాణమే ఈ సినిమా. అప్పలరాజుకి అమలాపురంలో సినిమాలు చూడ్డం తప్ప మరే పనీ ఉండదు. థియేటర్‌కి వెళితే... సినిమాలన్నీ ఒకేలా పరమ బోర్ కొట్టేస్తున్నాయి. 'ఓస్... ఈ మాత్రం సినిమా నేను తీయలేనా..?' అనుకొని హైదరాబాద్ వచ్చేస్తాడు.అక్కడనుంచి అతను సినీ పరిశ్రమలోని పరిచయమయ్యే విచిత్రమైన పాత్రలతో అతను జర్నీ చేసి ఎలాంటి సినిమా తీస్తాడు అనేది కథ.
అప్పల్రాజు పాత్రలో సునీల్ కనిపిస్తాడు. ఇక స్వాతి, సాక్షి హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆదర్శ్, కృష్ణుడు, వేణుమాధవ్, అలీ, తనికెళ్ల భరణి, చలపతిరావు తదితరులు నటిస్తున్నారు. సమర్పణ: వందిత కోనేరు, కెమెరా: సుధాకర్ యెక్కంటి, సహ నిర్మాత: సుమన్ వర్మ.
No comments:
Post a Comment