ఒకప్పుడు తెలుగు సినిమాలకు శాటిలైట్ రైట్స్ రూపంలో మంచి డబ్బులు వచ్చేవి. చిన్నా చితకా సినిమాలకి కూడా లక్షల్లో వచ్చేవి. జీటీవీ తమ తెలుగు చానెల్ స్టార్ట్ చేసాక ఇది మరీ ఎక్కువైపోయింది. ఫ్లాప్ సినిమాలకు కూడా కోట్లు ఆఫర్ చేయడం జరిగింది. దాంతో ఆ పోటీని తట్టుకోలేక, ఈటీవీ , మాటీవీ, జెమినీ కొన్నాళ్ల క్రితం తమకు తాముగా ఈ పోటీ నుంచి తప్పుకోవడంతో ఒక్క జీటీవీ మాత్రమే వీటిని ఎక్కువగా కొంటోంది. జెమినీ కూడా అప్పుడప్పుడు కొంటోంది కానీ, పోటీకి వెళ్లి కొనడం లేదు. దాంతో పెద్ద హీరోల సినిమాలకే మంచి రేటు వస్తోంది.
ఈ నేపధ్యంలో మాటీవీ కొత్తగా 'మా మూవీస్' పేరుతో మరో కొత్త చానెల్ ని ప్రారంభించడంతో శాటిలైట్ రైట్స్ మళ్లీ ఊపందుకుంటున్నాయని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. దానికి ఊతమిస్తున్నట్టుగా ఇటీవల మాటీవీ 'దూకుడు' సినిమా శాటిలైట్ రైట్స్ ని పెద్ద మొత్తం వెచ్చించి, చేజిక్కించుకున్నట్టు చెబుతున్నారు. సుమారు 5.75 కోట్లకు ఈ సినిమా హక్కుల్ని మాటీవీ పొందినట్టు తెలుస్తోంది. దీంతో మాటీవీ ఇక శాటిలైట్ రైట్స్ విషయంలో 'దూకుడు'గా వెళ్లడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే టర్కీ, దుబాయ్ లలో షూటింగ్ పూర్తి చేసుకొని, రీసెంట్ గా పాటలు మరికొన్ని సీన్స్ ను కచ్, గుజరాత్ లలో చిత్రీకరించిన విషయంత తెలిసిందే. కాగా తదుపరి షెడ్యూల్ ఫిబ్రవరి 15న హైదరాబాదులో మొదలై మార్చి చివరికి పూర్తవుతుందని సమాచారం.
No comments:
Post a Comment