ఇకపోతే బాలీవుడ్ హిట్ సినిమాలని రీమేక్ చేయడానికి తెలుగు సినిమా నిర్మాతలు ఆసక్తి చూపించలేదు. దానికి కారణం బాలీవుడ్ సినిమాలు నైజాంతో పాటు అన్ని ముఖ్యమైన నగరాలలో విడుదలవుతూ ఉంటాయి. కాబట్టి విడుదలయిన వెంటనే మనవాళ్శు వెంటనే కవర్ చేస్తూ ఉంటారు. దానివల్ల వాటిని రీమేక్ చేసినా ఉపయోగం ఉండకపోవచ్చనే కాబోలు వాటిని రీమేక్ చేయడం మానివేశారు మనవాళ్శు.
కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ దానికి భిన్నంగా బాలీవుడ్ లో హిట్ అయినటువంటి లవ్ ఆజ్ కల్, దబాంగ్ రీమేక్ వల్ల టాలీవుడ్ నిర్మాతలు దృష్టి ఇప్పుడు బాలీవుడ్ సినిమాల మీద పడిందని అంటున్నారు. ఇది మాత్రమే కాకుండా బాలీవుడ్‌లో రీసెంట్‌గా హిట్స్ అయినటువంటి నోవన్ కిల్డ్ జెస్సికా, యమ్లా పగ్లా దీవాలా లాంటి సినిమాలకు మంచి గిరాకీ ఏర్పడిందని ఫిలింవర్గాల సమాచారం. ఇలాగే ఇప్పుడు బాలీవుడ్ సినిమాలకు ఇంత గిరాకీ రావడానికి కారణం పవన్ కళ్యాణ్ అని అంటున్నారు.
No comments:
Post a Comment