ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Monday, February 14, 2011
మహేష్ బాబు దూకుడు చిత్రం శాటిలైట్ రైట్స్ ఎంతంటే...
మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న "దూకుడు" చిత్రం ప్రారంభం నుంచి విపరీతమైన క్రేజ్ క్రియోట్ చేస్తూ వస్తోంది. దాంతో మార్కెట్లో నూ ఈ చిత్రంపై మంచి హైప్ ఏర్పడి ..శాటిలైట్ రైట్స్ ఐదు కోట్ల డబ్బై ఐదు లక్షలు వరకూ పలికినట్లు సమాచారం. మా టీవీ వారు ఈ చిత్రం ను తీసుకున్నారు. మాటీవీ వారు రీసెంట్ గా లాంచ్ చేసిన మా మూవీస్ కోసం ఈ చిత్రం పోటీపడి మరీ తీసుకున్నారు.
ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది.ఇప్పటికే టర్కీ, దుబాయి,గుజరాత్ లలో ఈచిత్రం షూటింగ్ జరుపుకుని వచ్చింది.తదుపరి షెడ్యూల్ పిబ్రవరి 15 నుంచి మార్చి 3 వరకూ హైదరాబాద్ లో జరగనుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఆచంట గోపీచంద్, అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ అందిస్తూంటే కోన వెంకట్ మాటలు రాస్తున్నారు.
No comments:
Post a Comment