కెసిఆర్‌పై ఆంధ్రా మహిళల బిర్యానీ ఫైట్: రుచి చూడాలని సవాల్
కాకినాడ: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు కె చంద్రశేఖరరావు ఆంధ్రావాళ్లు బిర్యానీ చేస్తే పేడలా ఉంటుందన్న వ్యాఖ్యలపై ఆంధ్రా మహిళలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బిర్యానీని నిజాం ప్రభువులకు సైతం పరిచయం చేసింది ఆంధ్రావాళ్లే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. బిర్యానీ తమిళనాడులో పుట్టిందని, ఆ తర్వాత ఆంధ్రా ప్రాంతానికి వచ్చిందన్నారు. ఎవరైనా అంధ్రా వంటలు అంటారు కానీ తెలంగాణ వంటలు అని ఎక్కడా అనలేదన్నారు. ఆంధ్రా వంటలు పేడలా ఉంటాయని ఆంధ్రా మహిళలను కేసిఆర్ కించపరిచారన్నారు.
కెసిఆర్ తమ చేతి వంట తినడానికి రావాలని సవాల్ విసిరారు. కెసిఆర్ కోడలు కాకినాడకు చెందిన అమ్మాయి అని, ఆ అమ్మాయి వంట చూసి కెసిఆర్ అలా అనుకొని ఉంటారన్నారు. మీరు మా వద్దకు వచ్చి మా వంటలు రుచి చూడాలని సవాల్ చేశారు. కెసిఆర్ అలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని వారంతా ఖండించారు.
No comments:
Post a Comment