BREAKING NEWS
Wednesday, February 2, 2011
మక్కా పేలుళ్లలో హిందూ టెర్రరిజం హస్తం: సిఎం కిరణ్ వివాదాస్పద వ్యాఖ్య
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి బుధవారం సున్నిత ప్రాంతమైన పాతబస్తీలో హిందూ తీవ్రవాదం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఉదయం పాల్గొన్నారు. మక్కా పేలుళ్లలో హిందూ తీవ్రవాదుల హస్తం ఉందని వ్యాఖ్యానించారు. పాతబస్తీలో వెల్లువిరుస్తున్న మతసామరస్యాన్ని దెబ్బతీయడానికే హిందూ తీవ్రవాదులు మక్కా పేలుళ్లకు పాల్పడ్డారన్నారు. ఆ పేలుళ్లను మొదట ముస్లింలు చేశారని అందరూ భావించారన్నారు. కానీ సిబిఐ ఎంక్వయిరీలో హిందువులు చేసినట్టుగా తెలిసిందన్నారు. హైదరాబాదుకు మేలు చేయకుండా ఉండటానికి, రాష్ట్రంలో శాంతిభద్రతలను చెడగొట్టడానికే మక్కా పేలుళ్లకు పాల్పడ్డారన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment