BREAKING NEWS
Wednesday, February 2, 2011
జూ ఎన్టీఆర్ మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ 'శక్తి' విడుదల తేదీ
జూ ఎన్టీఆర్, మెహర్ రమేష్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న"శక్తి" చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయినట్లే.ప్రస్తుతం ఫైనల్ స్టేజస్ లో ఉన్న ఈ చిత్రం మార్చి 31వ తేదీన విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు నిర్ణయించారు. వైజయింతి బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది. కళ్ళు చెదిరే గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో ఓ సైన్స్ ఫిక్షన్ గా ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగు చలనచిత్ర చరిత్రలోనే అత్యధిక లొకేషన్లలో, అత్యధిక నిర్మాణ వ్యయంతో, అత్యాధునిక సాంకేతిక విలువలతో రూపొందుతోన్న ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఓ ల్యాండ్ మార్క్ చిత్రంగా నిలిచిపోతుందని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రంలో పూజాబేడీ ఈజిప్టు మహారాణిగా నెగిటివ్ టచ్ ఉన్న పాత్రను పోషిస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment