ఎక్స్ పోజింగ్ చేస్తాను తప్పేముంది?...దీక్షా సేథ్
ఎక్స్‌పోజింగ్ తప్పేమీ కాదు..అలగాని ఒప్పనీ చెప్పను. అవసరంలేని చోట స్కిన్ షో చేయనక్కర్లేదు. పాత్ర డిమాండ్ చేసినప్పుడు ఎక్స్‌పోజ్ చేయవచ్చు. అయితే అది పరిధులు దాటనంత వరకు ఓకే అని చెప్తోంది దీక్షాసేధ్. వేదం చిత్రంతో పరిచయమై మిరపకాయ్, వాంటెడ్ అంటూ దూసుకుపోతున్న దీక్షాసేధ్ తెరపై మొహమాటం లేకుండా తన అందాలను పరుస్తోంది. ఈ విషయమై మీడియా వారు అడిగిన ప్రశ్నకు ఆమె ఇలా స్పందించింది. అలాగే...తాను బికినీ వేసుకోవటానికి కూడా ఆలోచించనని, క్యారెక్టర్ డిమాండ్ మేరకు ఏదైనా చేస్తానంటూ మిగతా దర్శకులుకు సందేశం పంపుతోంది. అయితే ఆమె ఎంత తక్కువ బట్టలు వేసుకోవాలంటే అంత ఎక్కువ రెమ్యునేషన్ ఇస్తే సరి..అదే దీక్షా గురించి ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. ఇక తన అందం గురించి చెపుతూ..అందం కోసం ప్రత్యేకంగా ఏమీ చేయను. నచ్చినవి తినేస్తా. నాకు నచ్చినట్లు ఉంటా. జిమ్‌కి వెళ్లాలంటే నాకు బద్దకం. నాలో మార్చుకోవాలనుకునేది ఆ బద్దకించే గుణాన్నే అంది.
No comments:
Post a Comment