ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Wednesday, February 2, 2011
పెద్దవారని మర్యాద ఇచ్చాం, కాపాడుకోలేక పోయారు: ఎంపీ సర్వే
పెద్దవారని మర్యాద ఇచ్చాం, కాపాడుకోలేక పోయారు: ఎంపీ సర్వే
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు వెంకటస్వామి పెద్దవారని ఇన్నాళ్లూ మర్యాద ఇచ్చామని, కానీ ఆయన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీపైనే విమర్శలు చేయడంతో కాంగ్రెసు నేతలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ బుధవారం అన్నారు. ఆయన తన మర్యాదను కాపాడుకోలేక పోయారన్నారు. సోనియా అధ్యక్షురాలిగా ఉంటే కాంగ్రెసు పార్టీ సర్వనాశనం అవుతుందనటం తీవ్రాతితీవ్రం అన్నారు. వెంకటస్వామి పార్టీలో ఉండి చాలా లాభాలు పొందారన్నారు. ఓ కొడుకు పార్లమెంటు సభ్యుడిగా, మరో కొడుకు మంత్రి పదవి, అల్లుడికి మంత్రి పదవి, మనువడికి లెజిస్ట్రేటివ్ చైర్మన్‌గా నియమించుకున్నారన్నారు. అలాంటి వ్యక్తి ఇలా మాట్లాడటం శోచనీయమన్నారు. కాంగ్రెసు పార్టీ వల్ల వెంకటస్వామి ఎక్కువ లాభపడ్డారన్నారు.
పాన్‌దాన్, ఖాన్‌దాన్ పేరుతో పదవులు పొందిన వెంకటస్వామి తన సామాజిక వర్గానికి కూడా ఏమీ చేయలేదన్నారు. తాను దళితుడనే ప్రగల్భాలు పలకడమే కానీ ఎవరికీ చేసింది ఏమీ లేదన్నారు. ఆయన ఎంతమంది ఎమ్మెల్యేలను, ఎంపీలను తయారు చేశారో చెప్పాలన్నారు. ఆయన కేవలం కుటుంబం గురించే ఆలోచిస్తాడన్నారు. కానీ రాష్ట్రం గురించి, దేశం గురించి, మరో వ్యక్తి గురించి ఎప్పుడూ ఆలోచించరన్నారు.
No comments:
Post a Comment