ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Wednesday, February 2, 2011
మజ్లీస్ పార్టీతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పొత్తు ఖరారు?
మజ్లీస్ పార్టీతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పొత్తు ఖరారు?
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీలో చిరంజీవి నేతృత్వంలోని చిరంజీవి ప్రజారాజ్యం విలీనానికి మార్గం సుగమమైన నేపథ్యంలో మజ్లీస్‌తో స్నేహానికి తగిన మార్గదర్శక సూత్రాలు రూపొందుతున్నట్లు సమాచారం. మజ్లీస్ శానససభ్యులు బుధవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. మజ్లీస్, ప్రజారాజ్యం పార్టీల సహకారంతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మనుగడ సాగించాలని భావిస్తోంది. ఈ స్థితిలో చిరంజీవితో దోస్తీ ఖాయమైనట్లే. అదికారిక ప్రకటనే తరువాయి అంటున్నారు. ఈ స్థితిలో మజ్లీస్ మద్దతు సంపాదించుకునేందుకు తగిన చర్యలకు కిరణ్ కుమార్ రెడ్డి ముందుకు వచ్చారు.
మజ్లీస్‌తో జత కట్టడంలో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం హైదరాబాదు రచ్చబండ కార్యక్రమంలో వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. హిందూ తీవ్రవాదమంటూ ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. దానికితోడు ముస్లిం మైనారిటీలకు తాయిలాలు ప్రకటించారు. ముస్లిం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, కేసుల్లో ఇరుక్కున్న వారికి తగిన పరిహారం చెల్లిస్తామని, కేసులతో సంబంధం లేని ముస్లిం యువతకు దాన్ని వర్తింపజేస్తామని ఆయన చెప్పారు.
మజ్లీస్‌తో జతకట్టడానికి అనువుగానే కిరణ్ కుమార్ రెడ్డి ఆ ప్రకటన చేశారని అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ముస్లింల పట్ల సానుకూలంగా ఉందని చెప్పి మజ్లీస్ నేతలు ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడానికి అవసరమైన రంగం సిద్ధం చేసినట్లు భావిస్తున్నారు
No comments:
Post a Comment