BREAKING NEWS
Tuesday, March 29, 2011
మంగళ, దొంగలముఠా ఫ్లాపులపై చార్మి స్పందన
రీసెంట్ గా చార్మి నటించిన దొంగలముఠా,మంగళ చిత్రాలు భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి.అప్పటికే వరస ఫ్లాపులులో ఉన్న ఆమెను ఇలా కంటిన్యూగా ప్లాపులు వస్తున్నాయి కదా మీకేమీ ఇబ్బంది అనిపించటంలేదా...అది మీ కెరీర్ కి మైనస్ కాదా అని చార్మిని మీడీయావారు అడిగితే...ఆమె చాలా తెలివిగా...లెక్కల్లో మైనస్ అంటే నాకు చాలా ఇష్టం. దానికి మరో మైనస్ కలిస్తే అదే ప్లస్ అవుతుంది... కాబట్టి నా ప్రయత్నం నేను చేసాను. ఫ్లాఫ్ అయినంత మాత్రాన నేనే మైనస్ అనుకుంటే ఎలా అంది. సరే ఇంతకీ మీలో మైనస్ ఏమిటి అని అడిగితే..అనవసర విషయాల గురించి కూడా కొంచెం ఎక్కువగా ఆలోచిస్తాను. ఇప్పుడు నాలో మైనస్ ఏమిటి? అని అడిగారు కదా...ఓ నాలుగైదు రోజుల వరకూ ఈ విషయం గురించే ఆలోచిస్తాను. ఎంతకీ తట్టదు. అదే నాలో మైనస్ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం చార్మి నగరం నిద్రపోతున్న వేళ, సేవకుడు, హిందీలో బుడ్డా చిత్రాలు చేస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment