తమ భార్య రేణూ దేశాయ్‌తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు విభేదాలు పొడసూపినట్లు టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. రేణూ దేశాయ్‌తో విడాకులు తీసుకోవడానికి ఆయన సిద్ధపడ్డారట. ఈ మేరకు ఇరువురి మధ్య ఓ ఒప్పందం కుదిరినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. విభేదాలు ముదిరిపోయి విడాకులు తీసుకోవడానికి దారి తీసినట్లు చెబుతున్నారు. రేణూ దేశాయ్‌కి భరణం కింద ఆరు కోట్ల రూపాయలు ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ అంగీకరించారట. పిల్లల బాధ్యతను కూడా తానే తీసుకుంటానని ఆయన చెప్పినట్లు సమాచారం. రేణూ దేశాయ్ ప్రస్తుతం పూణేలోని తన పుట్టినింట్లో ఉంటున్నట్లు వినికిడి.
కాగా, పవన్ కళ్యాణ్ మొదటి భార్యను దూరంగా ఉంచి రేణూ దేశాయ్‌తో సహజీవనం సాగిస్తూ వచ్చారు. మొదటి భార్య వ్యవహారం కోర్టు దాకా వెళ్లింది. తన సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించే క్రమంలో మొదటి భార్యతో విడాకులకు పవన్ కళ్యాణ్ చర్చల ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు మళ్లీ రేణూ దేశాయ్‌తో పవన్ కళ్యాణ్ విడిపోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
No comments:
Post a Comment