ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్సకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'దూకుడు'. ఈ చిత్రం లో మహేష్ పోలీసు ఇన్ఫార్మర్ గా నటిస్తున్నాడు, సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబందించిన తాజా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. రాజుసుందరం నేతృత్వంలో పాట చిత్రీకరిస్తున్నారు. మొత్తం పది రోజుల షెడ్యూల్ లో కొంత యాక్షన్ పార్ట్ కూడా చిత్రీకరించనున్నారు.
ఇక పొతే ఒక నిర్ధారణ కానీ వార్త ఏమిటంటే దూకుడు సినిమా ఆడియో ను మే 31 న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అని . సూపర్ స్టార్ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ వేడుక జరగవచ్చు అని సమాచారం. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతకం ఫై అని సుంకర, రామ్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. కాగా జూలై మొదటి వారంలో సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
No comments:
Post a Comment