BREAKING NEWS
Tuesday, March 29, 2011
మగాళ్ల శీలాలకూ సేఫ్ లేదంటున్న యంగ్ హీరో
సినీ పరిశ్రమలో ఆడపిల్లలు ప్రవేశిస్తానంటే అక్కడ వారికి రకరకాల సమస్యలు ఎదరౌతాయని అందరూ అంటూంటారు.అది చాలా భాగం నిజమని సినీ పరిశ్రమలో పెద్దలు కూడా అంటూంటారు. అయితే బాలీవుడ్‌లో అవకాశాల కోసం ఆడపిల్లలు నానా బాధలు పడుతుంటే మగవాళ్లు కూడా అంతకంటే ఎక్కువ బాధలు పడాల్సి వస్తోందని యువ హీరో రణవీర్ సింగ్ చెప్తున్నారు.ఆడపిల్లల తో పాటు అబ్బాయిలకుకూడా సమానమైన ప్రమాదాలు ఎదురవుతున్నాయని అంటున్నాడు. అటు ఆడపిల్లల్ని, మగవాళ్లని కూడా వదలకుండా ఇబ్బంది పెడుతున్నారని రణవీర్‌సింగ్ చెప్పాడు.ముఖ్యంగా మగవాళ్ళ నుండే మగవాళ్ళకు సమస్యలు ఎదరౌతున్నాయని అంటున్నాడు. అయితే తన అదృష్టవశాత్తు తనకు అలాంటి సమస్యలు ఎదురుకాలేదని చెప్పాడు. ఎందుకంటే..తాను యష్‌రాజ్ సంస్థ నిర్మించిన బ్యాడ్ బజా భరత్ చిత్రంతో పరిచయమయ్యాను కాబట్టి తనకా సమస్య ఎదురుకాలేదని అన్నాడు.మొత్తానికి సినీ పరిశ్రమలో మనిషి అన్నవాళ్లని వదలట్లేదని, వారి ద్వారా ఏదో ఒక ఉపయోగం ఉంటేనే అవకాశాలు దొరుకుతున్నాయని రణవీర్‌సింగ్ చెప్పిన మాటలు బాలీవుడ్ లో జనాల్ని ఆలోచనలో పడేస్తున్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment